Thu Dec 19 2024 17:00:08 GMT+0000 (Coordinated Universal Time)
నేడు ఢిల్లీకి డీకే
నేడు కాంగ్రెస్ హైకమాండ్ కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరో తేల్చనుంది. ఇప్పటికే సిద్ధరామయ్య ఢిల్లీకి చేరుకున్నారు
నేడు కాంగ్రెస్ హైకమాండ్ కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరో తేల్చనుంది. ఇప్పటికే సిద్ధరామయ్య ఢిల్లీకి చేరుకున్నారు. ఏఐసీసీ నేతలతో సమావేశమయ్యారు. ఈరోజు పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. ఈరోజు మధ్యాహ్నానికి కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరో తేలనుంది. మరికాసేపట్లో ప్రత్యేక విమానంలో బయలుదేరి ఆయన ఢిల్లీకి చేరుకోనున్నారు.
సిద్ధారామయ్యకే...
అయితే ఇద్దరిలో ఎవరో ఒకరి పేరును ఖరారు చేసే అవకాశమున్నప్పటికీ, సిద్ధరామయ్యకే తొలి ఛాన్స్ ఇచ్చే అవకాశాలున్నట్లు హస్తిన వర్గాలు తెలిపాయి. ఈ నెల 30 తేదీన డీకే శివకుమార్ ఈడీ ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉండటం, ఆయనపై దాదాపు 19 కేసులు ఉండటంతో ఆయనకు చివరి రెండున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రి చేయాలని అధినాయకత్వం భావిస్తుంది.
Next Story