Wed Jan 08 2025 07:31:30 GMT+0000 (Coordinated Universal Time)
నేడు దేశ వ్యాప్తంగా రాజ్యాంగ దినోత్సవం
నేడు దేశ వ్యాప్తంగా భారత రాజ్యాంగ దినోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు.
నేడు దేశ వ్యాప్తంగా భారత రాజ్యాంగ దినోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇందుకు అనుగుణంగా కార్యక్రమాలు రూపొందించాయి. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఈ రోజు ఉదయం 11 గంటలకు ఘనంగా “భారత రాజ్యాంగం దినోత్సవాలు” జరగనున్నాయి. “హమారా సంవిధాన్, హమారా స్వాభిమాన్” నినాదంతో ఏడాది పొడవునా 75 వ “భారత రాజ్యాంగం దినోత్సవాలు” ప్రభుత్వం జరపనుంది. ఇందుకు సంబంధించిన క్యాలెండర్ ను కూడా ప్రభుత్వం రూపొందించింది. రాజ్యాంగం ఏర్పడి 75 సంవత్సరాలు కావడంతో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది.
ఆంధ్రప్రదేశ్ లోనూ...
అదే సమయంలో ఏపీలోనూ మంగళవారం 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని అన్ని శాఖల కార్యదర్శులు,శాఖాధిపతులు,అందరు జిల్లా కలక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.ఈ వేడుకల్లో భాగంగా భారత రాజ్యాంగ నిర్మాత,భారత రత్న,బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు, చిత్రపటాలకు పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం తోపాటు కార్యక్రమంలో పాల్గొన్న అందరితో రాజ్యాంగ పీఠికను చదివించాలని సూచించారు.
Next Story