Sun Dec 22 2024 23:01:53 GMT+0000 (Coordinated Universal Time)
kejrival : నేడు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టుకు కేజ్రీవాల్
నేడు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను సీబీఐ అధికారులు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చనున్నారు
నేడు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను సీబీఐ అధికారులు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చనున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను సీబీఐ, ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలసిందే. మార్చి 21వ తేదీన కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయగా, ఆయన లోక్సభ ఎన్నికల సమయంలో మధ్యంతర బెయిల్ పై ప్రచారం కోసం బయటకు వచ్చారు.
బెయిల్ ఇచ్చినా...
తర్వాత తిరిగి పోలీసులకు లొంగిపోయి జైలుకు వెళ్లిపోయారు. తీహార్ జైలులో ఉన్న కేజ్రీవాల్ ను నేడు ట్రయల్ కోర్టు ఎదుట హాజరుపర్చనున్నారు. ఆయనకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ ఇచ్చినా హైకోర్టు దానిపై స్టే విధించింది. దీంతో ఈరోజు మరోసారి జ్యుడిషియల్ కస్టడీని పొడిగించే అవకాశముంది.
Next Story