Mon Nov 18 2024 22:20:10 GMT+0000 (Coordinated Universal Time)
గుడ్ న్యూస్ .. గోల్డ్ కొనుగోలు చేయడానికి సరైన టైం
ఈరోజు దేశంలో బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. బంగారం కొనుగోళ్లకు ఇదే సరైన సమయమని నిపుణులు సూచిస్తున్నారు.
బంగారం ధర తగ్గినా, పెరిగినా లేకుంటే స్థిరంగా ఉన్నా వార్తే. ఎందుకంటే పసిడి ప్రియులకు అది న్యూస్ కిందే చెప్పుకోవాల్సి ఉంటుంది. బంగారం ధర సాధారణంగా పెరగడమో, తగ్గడమో జరుగుతుంది. అప్పుడప్పుడు స్థిరంగా ఉంటుంది. ముఖ్యంగా భారత్ లో పసిడికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. దానికి విలువ ఎప్పుడూ తగ్గదు. కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం వంటి కారణాలతో బంగారం విలువ పెరుగుతూ, తగ్గుతూ ఉంటుంది. రాబోయేది శ్రావణ మాసం కావడంతో బంగారం ధర పెరిగే అవకాశముంటుంది. కొనుగోళ్లు కూడా పెరగనున్నాయి. అందుకే బంగారం కొనుగోళ్లకు ఇదే సరైన సమయమని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.
ధరలు ఇలా...
ఈరోజు దేశంలో బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 51,160 రూపాయలు ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 46,900 రూపాయలు ఉంది. ఇక వెండి ధర కిలో 61,200 రూపాయలు ఉంది.
Next Story