Sun Nov 17 2024 22:25:36 GMT+0000 (Coordinated Universal Time)
ప్రియమైన బంగారం.. మీకు దగ్గరగా
ఈరోజు దేశంలో బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత రెండురోజులుగా పెరిగిన ధరలు ఈరోజు మాత్రం స్థిరంగా ఉన్నాయి.
బంగారం మహా ప్రియం. ఎప్పటికప్పుడు ధరలు పెరుగుతూనే ఉంటాయి. అందుకే బంగారంపై పెట్టిన పెట్టుబడి ఎక్కడికీ పోదు అన్నది మహిళలు చెప్పే మాట. గతంలో బంగారం కొనుగోలు చేయాలంటే కష్టమయ్యేది. ఒకేసారి డబ్బులు మొత్తం చెల్లించి కొనుగోలు చేయాల్సి వచ్చేది. కాని ఈరోజుల్లో అలా కాదు. గోల్డ్ స్కీమ్ లతో ఇంటి ముందుకు అనేక షాపులు వచ్చేశాయి. ఊరిచ్చేస్తున్నాయ్. మనం ఏది కొనుక్కోవాలనుకున్నా ప్రతి నెల ఇంత మొత్తం చెల్లిస్తే చాలు. ఏడాదికి ఆ బంగారు ఆభరణం మీ పరమవుతుంది. అప్పటి ధర మేరకు ఆభరణాన్ని మీకు ఇస్తారు. ఇలా బంగారం వినియోగం పెరిగింది. కొనుగోళ్లు పెరిగాయి. కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకులు వంటి కారణాలతో బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకుంటాయని మార్కెట్ నిపుణులు చెబుతుంటారు.
స్థిరంగా ధరలు...
అయితే బంగారం ధరలు పెరగకపోయినా, తగ్గకపోయినా మనకు శుభవార్తే. అంటే స్థిరంగా ఉండటం అన్నమాట. ఈరోజు దేశంలో బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత రెండురోజులుగా పెరిగిన ధరలు ఈరోజు మాత్రం స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం దర 50,730 రూపాయలు పలుకుతుంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 46,500 రూపాయలుగా ఉంది. వెండి ధర కూడా స్థిరంగా కొనసాగుతుంది. హైదరాబాద్ లో కిలో వెండి ధర 62,000 రూపాయల వద్ద కొనసాగుతుంది.
Next Story