Sun Nov 17 2024 18:20:18 GMT+0000 (Coordinated Universal Time)
బ్యాడ్ లక్.. బంగారం ధర పెరిగింది
తాజాగా దేశంలో బంగారం ధరలు పెరగాయి. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి.
గోల్డ్ అంటే ఎవరికి మక్కువ ఉండదు. ముఖ్యంగా మహిళలు అత్యంత మక్కువ చూపే వస్తువుగా బంగారం ఉంది. తమ మేనికి మరింత సొబగులు అద్దేందుకు బంగారు ఆభరణాలను మగువలను ఎంచుకుంటున్నారు. పసిడి ధరలు ఎంత పెరిగినా లెక్క పెట్టడం లేదు. దిగువ స్థాయి నుంచి ఎగువ స్థాయి వరకూ ప్రజలు తమ తొలి ప్రాధాన్యతగా బంగారాన్నే ఎంచుకుంటున్నారు. కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల వంటి కారణాలతో బంగారం ధరలతో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇక భవిష్యత్ లో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు.
తగ్గిన వెండి ధర...
తాజాగా దేశంలో బంగారం ధరలు పెరగాయి. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 50,780 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 46,550 రూపాయలుగా ఉంది. వెండి ధర నిన్నటి తో పోలిస్తే స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్ లో కిలో వెండి ధర 61,500 రూపాయలుగా కొనసాగుతుంది.
Next Story