Sun Nov 17 2024 10:57:36 GMT+0000 (Coordinated Universal Time)
గోల్డ్ కొనాలనుకుంటున్నారా... అయితే?
ఈరోజు దేశంలో బంగారం ధరలు తగ్గాయి. వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి.
బంగారం భారతీయ సంస్కృతిలో ఒక భాగమయింది. పండగలకు, పెళ్లిళ్లకు బంగారం కొనుగోలు చేయడం అలవాటుగా మారింది. పెళ్లిళ్ల సీజన్ లో బంగారానికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. పేద నుంచి ధనికుల వరకూ బంగారాన్ని కొనుగోలు చేయాలని భావిస్తుంటారు. అయితే కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల వంటి కారణాలతో బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. అందుకే బంగారం ధరలు తగ్గినప్పుడే కొనుగోలు చేయాలని మార్కెట్ నిపుణులు సూచిస్తుంటారు. బంగారం ధరలు ఒకరోజు బాగా పెరిగితే ఒక రోజు స్వల్పంగా తగ్గుతాయి. మరొకరోజు స్థిరంగా కొనసాగుతాయి. ఆభరణాలకు అత్యంత విలువ నిచ్చే భారతీయులు బంగారాన్ని పెట్టుబడిగా కూడా భావిస్తుండటమే డిమాండ్ పెరగడానికి కారణం.
స్థిరంగా వెండి ధరలు...
గత కొద్ది రోజులుగా బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ధరలు పెరగకపోవడం కొనుగోలుదారులకు చాలా ఊరట కల్గించే విషయమే. తాజాగా ఈరోజు దేశంలో బంగారం ధరలు తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 52,880 రూపాయలుగా కొనసాగుతుంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 48,460 రూపాయలు పలుకుతుంది. ఇక కిలో వెండి ధర ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతుంది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్ లో 68,100 రూపాయలుగా ఉంది.
Next Story