Sun Nov 17 2024 00:30:47 GMT+0000 (Coordinated Universal Time)
వావ్... గోల్డ్ రేట్స్ ఈరోజు ఎంతంటే?
దేశంలో ఈరోజు బంగారం ధరలు భారీగా తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరపై రూ.400లు తగ్గింది. వెండి కూడా భారీగానే తగ్గింది
భారత్ లో బంగారం కొనుగోళ్లు ఎక్కువే. ప్రపంచంలో వినియోగించే బంగారంలో పదకొండు శాతం భారత్ లోనే ఉంది. దక్షిణాది రాష్ట్రాలకు చెందిన వారు ఎక్కువగా బంగారాన్ని ఇష్టపడతారు. బంగారం ధరలు పెరిగినా తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కొనుగోళ్లు మాత్రం ఆగవు. కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి మారకం విలువ వంటి కారణాలతో బంగారం ధరలు పెరుగుతాయంటున్నారు మార్కెట్ నిపుణులు. ఇప్పటికే బంగారం యాభై అయిదు వేలు దాటింది. ఈ ఏడాది చివరి నాటికి అది 70 వేలకు చేరుకున్నా ఆశ్చర్యం లేదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇతర దేశాల్లో మాదిరిగా గోల్డ్ బాండ్స్ కంటే ఆభరణాలకే మనోళ్లు ప్రాధాన్యత ఇస్తుండటంతో బంగారం దిగుమతులు అధికంగా చేసుకోవాల్సి వస్తుంది.
భారీగా తగ్గిన వెండి...
తాజాగా దేశంలో ఈరోజు బంగారం ధరలు భారీగా తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరపై రూ.400లు తగ్గింది. వెండి కూడా భారీగానే తగ్గింది. కిలో వెండి పై వెయ్యి రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 50,900 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 55,530 రూపాయలుగా ఉంది. ఇక కిలో వెండి ధర 73,500 రూపాయలకు చేరుకుంది.
Next Story