గోల్డ్ లవర్స్ కు గ్రేట్ రిలీఫ్
దేశంలో ఈరోజు బంగారం ధరలు భారీగా తగ్గాయి. పది గ్రాముల బంగారంపై రూ.430లు తగ్గింది. వెండి ధరలు కూడా తగ్గాయి
బంగారం ధరలు ఎప్పుడు తగ్గుతాయో అని పసిడి ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఎప్పుడు తగ్గితే అప్పుడు కొనుగోలు చేయడానికి సిద్దమవుతుంటారు. బంగారం భారతీయ సంస్కృతిలో భాగంగా మారడంతో బంగారం ధరలు ఎప్పుడు తగ్గుతాయో చెప్పలేని పరిస్థితి. పెరగడమే తప్ప తగ్గడం తక్కువ సార్లు చూస్తుంటాం. కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, రష్యా - ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం వంటి కారణాలతో బంగారం, వెండి ధరలు పెరుగుతుంటాయని మార్కెట్ నిపుణులు చెబుతుంటారు. ఇక కేంద్ర బడ్జెట్ లో పెంచిన కస్టమ్స్ డ్యూటీతో రానున్న కాలంలో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశముందని చెబుతున్నారు. పెళ్లిళ్ల సీజన్ కూడా వస్తుండటంతో బంగారం ధరలు మరింత పెరుగుతాయి. కొనుగోళ్లకు సరిపడా బంగారం నిల్వలు అందుబాటులో లేకపోతే మరింత ధరలు పెరిగే అవకాశముందని కూడా చెబుతున్నారు.