పుత్తడి ధర తగ్గిందోచ్
ఈరోజు దేశంలో భారీగా బంగారం ధరలు తగ్గాయి. పది గ్రాముల బంగారం పై రూ.380లు తగ్గింది. వెండి ధరలు మాత్రం పెరగడం విశేషం
బంగారం ధర తగ్గిందని సంతోష పడటానికి వీలులేదు. ఎందుకంటే తగ్గినా అది స్వల్పంగానే తగ్గుతుంది. పెరిగితే మాత్రం భారీగా పెరుగుతుంది. బంగారానికి ఉన్న డిమాండ్ అలాంటిది. బంగారం భారతీయ సంస్కృతిలో భాగమయిన నాటి నుంచి దాని వినియోగం పెరిగిపోయింది. ప్రధానంగా భారతీయ మహిళలు వినియోగించే ఆభరణాలు బంగారానివే ఉండాలని కోరుకుంటుండటంతో ఈ పరిస్థితి తలెత్తింది. కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల వంటి కారణాలతో బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకుంటాయని మార్కెట్ నిపుణులు చెబుతుంటారు. పెళ్లిళ్ల సీజన్ కూడా పూర్తి కావడంతో బంగారానికి డిమాండ్ తగ్గుతుందని భావించినప్పటికీ కొనుగోళ్లు మాత్రం ఆగవన్నది వ్యాపారులు చెబుతున్న మాట. డిమాండ్ కు తగినట్లుగా బంగారాన్ని దిగుమతి చేసుకోవడం కారణంగా బంగారానికి ఎప్పుడూ వన్నె తగ్గనట్లుటానే.. డిమాండ్ కూడా తగ్గదంటున్నారు.