బంగారం ధర ఈరోజు ఎంతంటే?
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు కూడా స్థిరంగానే ఉన్నాయి
బంగారం అంటేనే భారతీయులకు మహా ప్రీతి. తమ ఇంట్లో ఉండాల్సిన వస్తువుగా అందరూ భావించడంతోనే దానికి భారత్ లో డిమాండ్ అధికంగా ఉంటుంది. ఇతర ప్రపంచ దేశాల్లో గోల్డ్ బాండ్లు కొనుగోలు చేస్తారు. కానీ భారత్ లో అలా కాదు. కేవలం ఆభరణాలను కొనుగోలు చేసేందుకే మొగ్గు చూపుతారు. అందుకే బంగారానికి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. అలంకార వస్తువుగానూ, ఆభరణాలుగానే కాకుండా పెట్టుబడి రూపంలో చూడటం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడింది. కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల వంటి కారణాలతో బంగారం ధరలు పెరుగుతుంటాయని మార్కెట్ నిపుణులు చెబుతుంటారు. కానీ ధరలతో సంబంధం లేకుండా కొనుగోళ్లు జరుగుతుండటంతో జ్యుయలరీ షాపులు ఇబ్బడి ముబ్బడి గా వెలుస్తున్నాయి. సరికొత్త డిజైన్లతో భారతీయులను ఆకట్టుకునే ప్రయత్నాన్ని వ్యాపారులు ఎప్పుడూ చేస్తుంటారు.