Fri Nov 15 2024 22:36:39 GMT+0000 (Coordinated Universal Time)
గ్రేట్ రిలీఫ్.. ఈరోజు కూడా తగ్గాయ్
ఈరోజు దేశంలో స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు మాత్రం పెరిగాయి. పది గ్రాముల బంగారంపై రూ.100లు మాత్రమే తగ్గింది
బంగారం ధరలు ఎప్పుడూ పెరుగుతూనే ఉంటాయి. ఎప్పుడో కాని తగ్గవు. తగ్గినప్పుడు స్వల్పంగా తగ్గుతాయి. పెరిగినప్పుడు భారీగా పెరుగుతాయి. అందుకే బంగారం కొనుగోలు చేయాలనుకున్న వారు కూడా పెరిగిన ధరలు చూసి ఎంత అవసరమో అంతే కొనుగోలు చేస్తున్నారు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో అవసరమైనంత మేరకే బంగారం కొనుగోలు చేస్తున్నారని, కొంత కొనుగోళ్లు తగ్గుముఖం పట్టాయని వ్యాపారులు కూడా చెబుతున్నారు. కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు, ద్రవ్యోల్బణం, డాలర్‌తో రూపాయి తగ్గుదల, ద్రవ్యోల్బణం, రష్యా - ఉక్రెయిన్ యుద్ధం, కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో కస్టమ్స్ డ్యూటీ పెంచడంతో పాటు దిగుమతులు తగ్గించడం కూడా బంగారం ధరలు పెరగడానికి కారణాలుగా చెబుతున్నారు. అందుకే బంగారం పేద, మధ్య తరగతి ప్రజలకు భారంగా మారింది.
వెండి మాత్రం...
తాజాగా ఈరోజు దేశంలో స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు మాత్రం పెరిగాయి. పది గ్రాముల బంగారంపై రూ.100లు మాత్రమే తగ్గింది. కిలో వెండి ధరపై రూ.110లు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 55,800 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 60,870 రూపాయలుగా నమోదయింది. ఇక కిలో వెండి ధర 80,200 రూపాయలుగా నమోదయింది.
Next Story