Mon Nov 18 2024 12:36:57 GMT+0000 (Coordinated Universal Time)
గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర
ఈరోజు దేశంలో బంగారం, వెండి ధరలు తగ్గాయి. పది గ్రాముల బంగారం పై రూ.600 ల, కిలో వెండిపై రూ.300లు తగ్గింది.
బంగారం ధరలు రెండు రోజుల నుంచి తగ్గుముఖం పడుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్ పూర్తి కావడం, శ్రావణమాసం పూర్తి కావస్తుండటంతో కొనుగోళ్లు మందగించాయి. బంగారం ధరలు ఒక్కోసారి పెరుగుతుంటాయి. మరొకసారి తగ్గుతుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వల ఆధారంగా బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. పసిడి అంటే ఇష్టపడే భారతీయ మహిళలు దానిని పెట్టుబడిగా చూడటం మొదలయిన నాటి నుంచి ఒక సీజన్ లేకుండా కొనుగోళ్లు జరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. బంగారం, వెండి అత్యంత ప్రియమైన వస్తువులుగా ప్రతి భారతీయుల ఇంట్లో ఉండటంతో వాటి డిమాండ్ ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది.
ధరలు ఇలా...
ఈరోజు దేశంలో బంగారం, వెండి ధరలు తగ్గాయి. పది గ్రాముల బంగారం పై రూ.600 ల, కిలో వెండిపై రూ.300లు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 51,230 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 47,000 రూపాయలుగా కొనసాగుతుంది. ఇక హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ధర 60,700 రూపాయలుగా ఉంది.
Next Story