Sun Nov 17 2024 04:46:41 GMT+0000 (Coordinated Universal Time)
వామ్మో.. బంగారం రేట్లు చూశారా?
ఈరోజు దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. పది గ్రాముల బంగారం ధర రూ.300లు పెరిగింది
ఏడాది మారుతున్నా బంగారం ధరలు మాత్రం తగ్గడం లేదు. కొత్త ఏడాదిలో బంగారం 60 వేలకు చేరుకునే అవకాశాలు లేకపోలేదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అందుకే కొనుగోలు చేయదలచుకున్న వారు ఇప్పుడే కొనుక్కోవాలని నిపుణులు సూచిస్తున్నారు. బంగారం భారతీయ సంస్కృతిలో భాగంగా మారి అది ప్రతి ఇంట్లో ఒక వస్తువుగా మారిపోయింది. ఒక నాడు అలంకార వస్తువుగా ఉండే బంగారం, నేడు అవసరంగా మారిపోవడం కూడా బంగారం డిమాండ్ పెరగడానికి కారణంగా చెబుతున్నారు. కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, ద్రవ్యోల్బణం వంటి కారణాలతో బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు బంగారం కొనుగోలు చేయాలంటే సామాన్యులకు అవకాశం లేదు. కొన్ని రోజులకు బంగారం ధనికుల వస్తువుగానే బంగారం మారిపోయే అవకాశముందన్నది మాత్రం ఖాయం.
వెండి పై కూడా...
తాజాగా ఈరోజు దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. పది గ్రాముల బంగారం ధర రూ.300లు పెరిగింది. కిలో వెండి పై రూ.1,000లు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. గత కొద్ది రోజులుగా బంగారం ధరలు పెరుగుతూనే ఉండటంతో కొనుగోళ్లు సయితం కొంత తగ్గుముఖం పట్టాయని వ్యాపారులు చెబుతున్నారు. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 54,930 రూపాయలు పలుకుతుంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 50,350 రూపాయలకు చేరుకుంది. ఇక కిలో వెండి ధర 74,500 రూపాయల వద్ద కొనసాగుతుంది.
Next Story