అ"ధర" హో బంగారం
దేశంలో ఈరోజు బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. పది గ్రాముల బంగారం పై రూ.500లు పెరిగింది
తగ్గిందని సంతోషపడేలోగా పెరగడం ఎంతసేపు. బంగారం విషయంలో ఇదే జరుగుతుంది. గత కొద్ది రోజులుగా బంగారం ధరలు తగ్గాయని కొనుగోలుదారులు సంబరపడిపోతుంటే ఆ ముచ్చట మూణ్ణాళ్లు కూడా లేదు. పసిడి అంటే భారతీయ పడతులు ప్రాణమిస్తారు. దాచుకున్న సొమ్ముతో ఎంతో కొంత బంగారాన్ని కొనుగోలు చేయాలని కోరుకుంటారు. అందుకే బంగారానికి డిమాండ్ ఎప్పుుడూ తగ్గదు. కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల వంటి కారణాలతో బంగారం ధరలు పెరుగుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. సీజన్ తోనూ, ధరలతోనూ సంబంధం లేకుండా కొనుగోళ్లు జరుగుతుండటంతో బంగారం ధరలు ఆకాశానికి అంటుతున్నాయన్న వారు కూడా లేకపోలేదు. ఒకప్పుడు అలంకార వస్తువుగా ఉన్న బంగారం నేడు అవసరమైన వస్తువుగా మారడంతో బంగారానికి డిమాండ్ బాగా పెరిందన్నది మార్కెట్ నిపుణుల మాట.