Mon Dec 23 2024 12:38:44 GMT+0000 (Coordinated Universal Time)
నేడు ఎయిర్ పోర్టుకు మోదీ శంకుస్థాపన
నేడు నోయిడా జెవార్ ఎయిర్ పోర్టుకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయనున్నారు
నేడు నోయిడా జెవార్ ఎయిర్ పోర్టుకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం రాకపోకలతో రద్దీ గా ఉండటంతో నోయిడాలో మరో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్మించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ నేడు శంకుస్థాపన చేయనున్నారు.
అతి పెద్ద విమానాశ్రయంగా....
నోయిడా జెవార్ ఎయిర్ పోర్టును దేశంలోనే అతిపెద్ద విమానాశ్రయంగా నిర్మించనున్నారు. దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతానికి మరో విమానాశ్రయం అవసరమని భావించి దీని నిర్మాణం వేగంగా చేపట్టాలని నిర్ణయించారు.
Next Story