Mon Dec 23 2024 14:41:28 GMT+0000 (Coordinated Universal Time)
మళ్లీ "పెట్రో" బాదుడు... ఏడోసారి...?
ఈరోజు కూడా పెట్రోలు, డీజిల్ ధరలు పెంచుతూ చమరు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి
చమురు సంస్థలు వినియోగదారుల పట్ల నిర్దయగా వ్యవహరిస్తున్నాయి. ప్రభుత్వం పూర్తిగా ధరల నిర్ణయాధికారం వాటి చేతుల్లో పెట్టడంతో ఇష్టారాజ్యంగా మారింది. కేంద్ర ప్రభుత్వం కోరినప్పుడు మాత్రం చమురు సంస్థలు ధరలు పెంచవు. ఏదైనా ఎన్నికలు ఉంటే పెట్రోలు ధరలు పెంచే సాహసానికి చమురుసంస్థలు ఒడిగట్టవు. సాధారణ రోజుల్లో మాత్రం ప్రజల ను వీరబాదుడు బాదుతుంది. కేంద్ర ప్రభుత్వం కూడా పట్టించుకోకపోవడంతో చమురు సంస్థలు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి.
వరసగా పెంచుతూ....
ఈరోజు కూడా పెట్రోలు, డీజిల్ ధరలు పెంచుతూ చమరు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. పెట్రోలు పై 90 పైసలు, డీజిల్ పై 76 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు నేటి నుంచే అమలులోకి రానున్నాయి. దీంతో హైదరాబాద్ లో లీటరు పెట్రోలు ధర 113.61 రూపాయలుగా, లీటరు డీజిల్ ధర 99.83రూపాయలుగా ఉంది. ఎనిమిది రోజుల్లో ఏడుసార్లు పెట్రోలు ధరలు పెంచి వినియోగదారుల నడ్డి విరుస్తున్నాయి చమురుసంస్థలు.
Next Story