Wed Nov 20 2024 17:30:57 GMT+0000 (Coordinated Universal Time)
తగ్గిన బంగారం.. స్వల్పంగా పెరిగిన వెండి
బంగారం ధర స్వల్పంగా తగ్గగా, వెండి ధర స్వల్పంగా పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
బంగారం అంటేనే మహిళల ఇష్టం అంతా ఇంతా కాదు. బంగారం కొనుగోలు చేసేందుకు కళ్లలో ఒత్తులు వేసుకుని మరీ చూస్తుంటారు. డబ్బు అందిన వెంటనే బంగారం దుకాణాలకు పరుగులు తీస్తారు. భారత దేశంలో బంగారం పట్ల మహిళలు అంత మక్కువ చూపబట్టే దానికి అంత డిమాండ్ ఏర్పడింది. ఇక బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటాయి. స్వల్పంగా తగ్గినప్పుడు, స్థిరంగా ఉన్నప్పుడే కొనుగోలు చేయాలని మార్కెట్ నిపుణులు చెబుతుంటారు. అంతర్జాతీయ మార్కెట్ ఒడిదుడుకుల ప్రభావం బంగారం ధరలపై ఉంటుంది.
ఈరోజు ధరలు ఇలా.....
ఈరోజు బంగారం ధర స్వల్పంగా తగ్గగా, వెండి ధర స్వల్పంగా పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 44,900 రూపాయలు ఉంది. అలాగే 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 48,990 రూపాయలుగా ఉంది. అయితే కిలో వెండిపై వందరూపాయలు పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్ లో 65,400 రూపాయలుగా ఉంది.
Next Story