Sun Dec 22 2024 16:05:46 GMT+0000 (Coordinated Universal Time)
నేడు మావో ప్రభావిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో మంత్రి అమిత్ షా భేటీ
నేడు కేంద్ర హోం మంత్రి అమిత్ నేతృత్వంలో మావోయిస్టుల ప్రభావిత రాష్ట్రాల ప్రభావిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు
నేడు కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో మావోయిస్టుల ప్రభావిత రాష్ట్ర ప్రభావిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. కేంద్రహోం మంత్రి అమిత్ షా ఈ సమావేశానికి నేతృత్వంల వహించనున్నారు. ఈ సమావేశానికి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి హాజరవుతున్నార. వీరితో పాటు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు చెందిన హోం మంత్రులు, చీఫ్ సెక్రటరీలు, డీజీపీలు కూడా హాజరు కానున్నారు.
రెండేళ్లకు మావోయిస్టులను...
2026 నాటికి మావోయిస్టుల సమస్యను పూర్తిగా రూపుమాపాలన్న లక్ష్యంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. భద్రతాదళలాల సహకారంతో రాష్ట్రాల పోలీసులు మావోయిస్టులను అణిచి వేయడంలో ఒకరికొకరు సహరించుకుంటూ గత కొన్నేళ్లుగా ముందుకెళుతున్నాయి. ఛత్తీస్గడ్ అటవీ ప్రాంతంలో ఇటీవల వరస ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. వందల సంఖ్యలో మావోయిస్టులు మరణించిన నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాథాన్యత సంతరించుకుంది.
Next Story