Fri Nov 22 2024 21:02:40 GMT+0000 (Coordinated Universal Time)
చితికిపోతున్న టమాటా రైతు
టమాటా రైతు చితికి పోతున్నాడు. మొన్నటి వరకూ వేల రూపాయలు పలికిన ధర నేడు పది రూపాయలు కూడా పలకడం లేదు
టమాటా రైతు చితికి పోతున్నాడు. మొన్నటి వరకూ వేల రూపాయలు పలికిన ధర నేడు పది రూపాయలు కూడా పలకడం లేదు. మార్కెట్కు తీసుకు వచ్చి కనీసం రవాణా ఛార్జీలు కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు. యాభై కేజీల టమాటా ధర ఐదు వందల రూపాయల ధర పలుకుతుంది. టమాటా రైతుకు అసలు గిట్టుబాటు కావడం లేదు. కనీసం తాము పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదని టమాటా రైతులు ఆవేదన చెందుతున్నారు. మరికొందరు గిట్టుబాటు ధర రాకపోవడంతో రైతులు టమాటాను పశుగ్రాసం కింద వదిలేస్తుండగా, మరికొందరు బయటకు తెచ్చి పారపోయడం కనిపిస్తుంది.
నిన్న మొన్నటి వరకూ...
పదిహేను రోజుల క్రితం వరకూ టమాటా ధర ఆకాశాన్నంటింది. బాక్సు టమాటా ధర వేలల్లో పలికింది. కొందరు టమాటా రైతులు ఒక్క పంటతోనే కోటీశ్వరులయ్యారు. టమాటా దొంగతనాలు కూడా జరిగాయి. టమాటాలకు కాపలాగా బౌన్సర్లను కూడా నియమించుకోవాల్సిన పరిస్థితి మొన్నటి వరకూ ఉండేది. అయితే ఇప్పుడు దేశ వ్యాప్తంగా దిగుబడి ఎక్కువగా రావడంతో టమాటా ధర ఒక్కసారి నేల చూపులు చూస్తుంది. బయట మార్కెట్ లో కేజీ టమాటా ధర పదిహేను రూపాయలే పలుకుతుంది. ఈ ధరలు మరింత పతనమయ్యే అవకాశాలున్నాయని తెలిసింది. ఎగుమతులు కూడా నిలిచిపోవడంతో టమాటా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
Next Story