Thu Dec 19 2024 09:50:14 GMT+0000 (Coordinated Universal Time)
వంటకి టమాటా మంట.. సబ్సిడీ ఇచ్చినా తగ్గేదే లే..
మంట లేనిదే వంట జరగదు. కానీ ఆ వంటలోకి నేను రానంటోంది టమాటా. టమాటాతో చేసే వంటకాలకు ఎందరో ప్రియులుంటారు.
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా టమాటా ధరలు భగ్గుమంటున్నాయి. టమాటా లేకపోతే కూరలు రుచి ఉండవు. కొందరికి టమాటాలు లేనిదే వంటే జరగదు. అలాంటి వారందరికీ టమాటా అందని ద్రాక్ష అవుతుంది. కనీసం ఒక కిలో కొందామన్న.. దిగిరానంటోందీ ఎర్రపండు. ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని రైతు మార్కెట్లలో కిలో టమాటా రూ.85-రూ.100 పలుకుతుంటే.. బయట మాత్రం రూ.100 పైగానే ఉంటోంది. ప్రభుత్వం సబ్సిడీ కింద రూ.50లకే టమాటాలు అందిస్తున్నా.. అవి కూడా సామాన్యులకు సరిపోవట్లేదు. ఉదయం వేళల్లో కేవలం 3 గంటలు మాత్రమే.. అది కూడా ఒకరికి ఒక కిలో టమాటా మాత్రమే సబ్సిడీగా ఇస్తుంది. ఇంకా కావాలంటే మర్నాడు ఉదయం రైతు మార్కెట్లో సబ్సిడీ టమాటా స్టాల్ కు క్యూ కట్టాల్సిందే.
మంట లేనిదే వంట జరగదు. కానీ ఆ వంటలోకి నేను రానంటోంది టమాటా. టమాటాతో చేసే వంటకాలకు ఎందరో ప్రియులుంటారు. అలాంటివారికి టమాటా ధర మింగుడు పడటం లేదు. టమాటా తో పాటు మిర్చి కూడా ధర ఎక్కువగానే ఉంటోంది. కిలో మిర్చి రూ.120 పైమాటే. మిగతా కూరగాయల విషయానికొస్తే.. కిలో రూ.40-50 వరకూ ఉన్నాయి. త్వరలోనే అవికూడా పెరుగుతాయని చెబుతున్నారు విశ్లేషకులు. కొద్దిరోజులుగా కిలో రూ.100 పలికిన టమాటా ఇప్పుడు.. దేశంలోని పలు ప్రాంతాల్లో రూ.150 దాటిపోయింది. కిలో టమాటా రూ.160 పలుకుతోంది. డిమాండ్ పెరిగితే.. త్వరలోనే రూ.200 అయినా ఆశ్చర్యం లేదు. కరోనా తొలినాళ్లలో ఉల్లిపాయల ధరలకూ ఇలాగే రెక్కలొచ్చాయి. కిలో రూ.200 - 250 వరకూ పలికింది. ఉల్లిపాయలంటే.. నిల్వ ఉంటాయి కాబట్టి కాస్త ధర తగ్గినపుడు కొనుక్కుని నిల్వ చేసుకున్నారు. కానీ టమాటా అలా కాదుగా.. ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నా.. మహా అయితే 10 రోజులు ఫ్రెష్ గా ఉంటాయి. ఆ తర్వాత అవి వంటకి పనిరాకుండా పాడవుతాయి. ఇటు కూరగాయలు.. అటు మాంసం ధరలకు ఒకేసారి రెక్కలు రావడంతో.. సామాన్యుడు ఏం కొనాలో ఏం తినాలో పాలుపోవట్లేదని గగ్గోలు పెడుతున్నాడు.
Next Story