Mon Dec 23 2024 23:25:52 GMT+0000 (Coordinated Universal Time)
టమాటాతో జర భద్రం.. కాపురాలు కూలిపోగలవు జాగ్రత్త !
వివరాల్లోకి వెళ్తే.. టిఫిన్ సెంటర్ నడుపుతున్న సంజీవ్ వర్మన్ వంటలు చేస్తున్న క్రమంలో కూరలో టమాటాలను వినియోగించాడు.
టమాటాల వల్ల కూడా కాపురాలు కూలిపోయే ప్రమాదం ఉందనేందుకు ఈ ఘటన ఉదాహరణగా నిలుస్తుంది. దేశవ్యాప్తంగా టమాటాల ధరలు అమాంతం పెరిగిపోయిన విషయం తెలిసిందే. టమాటాలు లేనిదే వంటలు తినలేని వారికి ఇది మింగుడు పడని విషయం. కిలో రూ.200 వరకూ ఉండటంతో.. అవసరానికి 50 గ్రాములు, 100 గ్రాముల టమాటాలు కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. మధ్యప్రదేశ్ లోని షాహ్డోల్ లో ఓ విచిత్ర ఘటన జరిగింది. భర్త కూరలో టమాటా వేశాడన్న కోపంతో భార్య ఇల్లు వదిలి వెళ్లిపోయింది.
వివరాల్లోకి వెళ్తే.. టిఫిన్ సెంటర్ నడుపుతున్న సంజీవ్ వర్మన్ వంటలు చేస్తున్న క్రమంలో కూరలో టమాటాలను వినియోగించాడు. గమనించిన భార్య ఆరతి భర్తపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. కూరలో టమాటాలు వేస్తే ఇంటి నుంచి వెళ్లిపోతానని హెచ్చరించింది. భవిష్యత్ లో ఇక టమాటా జోలికే పోనని భర్త హామీ ఇచ్చినా.. ఆమె ఇల్లువదిలి వెళ్లిపోయింది. ఆందోళన చెందిన అతను భార్యను వెతికేందుకు పోలీసులను ఆశ్రయించాడు. తన భార్య కనిపించడం లేదంటూ జరిగిందంతా చెప్పి ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఆరతి ఫోన్ నంబర్ ఆధారంగా.. ఆమె ఉమరియాలోని సోదరి ఇంటివద్ద ఉన్నట్లు గుర్తించారు. ఆరతితో మాట్లాడిన పోలీసులు.. ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చి.. దంపతుల్ని కలిపారు. అయితే తాము ఆరతితో మాట్లాడినపుడు.. తమకు 8 ఏళ్ల క్రితం వివాహమైందని నాలుగేళ్ల కుమార్తె కూడా ఉందని చెప్పిందన్నారు. తన భర్త తాగొచ్చి తనను, కుమార్తెను కొడుతుంటాడని అందుకే ఇల్లువదిలి వచ్చినట్లు చెప్పిందన్నారు. ఏదేమైనా మొత్తానికి టమాటా ఎంత పనిచేసిందో చూశారా.
Next Story