Fri Dec 20 2024 11:09:51 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణ - ఛత్తీస్గఢ్ రాకపోకలు బంద్
భారీ వర్షాలకు తెలంగాణ - ఛత్తీస్గఢ్ మధ్య రాకపోకలకు నిలిచిపోయాయి
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కర్ణాటక, మహారాష్ట్రల్లోనూ వర్షాలు అత్యధికంగా నమోదవుతున్నాయి. దీంతో తెలంగాణ - ఛత్తీస్గఢ్ మధ్య రాకపోకలకు నిలిచిపోయాయి. రేగుమాకు వాగు వంతెనపై నుంచి ప్రవహిస్తుండటంతో రాకపోకలను నిలిపేశారు. ములుగుజిల్లా టేకులగూడెం గ్రామం వద్ద వంతెనపై నుంచి నీరు ప్రవహిస్తుండటంతో ఎవరూ ఆ వంతెనపై ప్రయాణించకుండా పోలీసులు అక్కడ బందోబస్తును ఏర్పాటు చేశారు.
నది ఉప్పొంగడంతో...
గోదావరి నది కూడా ఉప్పొంగి ప్రవహిసతుంది. జూరాల ప్రాజెక్టు వద్ద క్రమంగా వరద ప్రవాహం పెరగడంతో పదిహేడు గేట్లను అధికారులు ఎత్తివేశారు. దాదాపు 66,810 క్యూ క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో అనేక వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అనేక గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచిపోయాయి.
Next Story