Fri Dec 20 2024 23:55:04 GMT+0000 (Coordinated Universal Time)
భారత్ జోడో యాత్రలో విషాదం .. ఎంపీ మృతి
రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్రలో విషాదం నెలకొంది. పార్లమెంటు సభ్యుడు సంతోష్ సింగ్ యాత్రలో మృతి చెందారు
రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్రలో విషాదం నెలకొంది. పార్లమెంటు సభ్యుడు సంతోష్ సింగ్ యాత్రలో మృతి చెందారు. కాంగ్రెస్ ఎంపీ సంతోష్ సింగ్ చౌదరి గుండెపోటుతో మరణించడంతో యాత్రలో విషాదం నెలకొంది. పంజాబ్ లోని ఫిల్లార్ వద్ద యాత్ర నిర్వహిస్తుండగా సంతోష్ సింగ్ చౌదరి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.
గుండెపోటుతో...
దీంతో హుటాహుటిన ఆయనను ఆసుపత్రికి తరలించారు. అయితే అంబులెన్స్ లో తరలిస్తుండగానే ఆయన మృతి చెందారు. ప్రస్తుతం సంతోష్ సింగ్ చౌదరి జలంధర్ పార్లమెంటు సభ్యుడిగా ఉన్నారు. గతంలో పంజాబ్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. దీంతో కాంగ్రెస్ శిబిరంలో విషాదం చోటు చేసుకుంది.
Next Story