Mon Dec 23 2024 03:32:15 GMT+0000 (Coordinated Universal Time)
బిడ్డ కోసం తల్లి.. హైనా వెంట పడి..?
ఛత్తీస్గడ్ లో విషాద సంఘటన చోటు చేసుకుంది. రెండేళ్ల చిన్నారిని హైనా ఎత్తుకెళ్లింది
ఛత్తీస్గడ్ లో విషాద సంఘటన చోటు చేసుకుంది. రెండేళ్ల చిన్నారిని హైనా ఎత్తుకెళ్లింది. ఆటుకుంటుండగా హైనా తీసుకెళ్లడం గమనించిన తల్లి దాదాపు మూడు కిలోమీటర్ల దూరం పరుగెత్తి బిడ్డను హైనా నుంచి తీసుకుంది. అయితే ఆ బిడ్డకు గాయాలు కావడంతో ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ బిడ్డ మృతి చెందారు. జగ్దల్పూర్ జిల్లా చిత్రకూట్ అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
మూడు కిలోమీటర్లు....
ఇంటి వద్ద బాలుడు ఆడుకుంటుండగా పొదల్లో నుంచి వచ్చిన హైనా చిన్నారిని నోట కరుచుకుని అడివిలోకి పరుగులు తీసింది. బిడ్డను కాపాడుకోవడానికి ఆ తల్లి హైనా వెంట మూడు కిలోమీటర్లు పరుగెత్తింది. అది చూసిన గ్రామస్థులు కూడా హైనా నుంచి బిడ్డను విడిపించడానికి ప్రయత్నాలు చేశారు. మూడు కిలోమీటర్లు దూరం పరుగెత్తిన తర్వాత హైనాతో పోరాడి బాలుడిని విడిపించినా ఫలితం దక్కలేదు. ఆ బాలులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించడంతో విషాదం నెలకొంది.
Next Story