Tue Nov 05 2024 12:24:54 GMT+0000 (Coordinated Universal Time)
Train Accident : ఘోర రైలు ప్రమాదం .. ఐదుగురు మృతి
పశ్చిమ బెంగాల్ లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు మరణించారు.
గాయపడినట్లు తెలిసింది. ఒకే ట్రాక్ పైకి వచ్చిన రెండు రైళ్లు ఢీకొట్టడంతోఈ ప్రమాదం జరిగింది. అసోంలోని సిల్చార్ నుంచి కోల్కత్తా లోని సెల్దాకు బయలుదేరిన కాంచన్ గంగా ఎక్స్ప్రెస్ రైలును వెనక నుంచి వచ్చిన గూడ్సు రైలు ఢీకొట్టింది. రంగపాని స్టేషన్ సమీపంలో ఆగి ఉన్న రైలును వెన నుంచి వచ్చిన రైలు ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద తీవ్రతకు గూడ్స్ రైలు చెల్లా చెదురుగా పడిపోయాయి. సిగ్నలింగ్ వ్యవస్థ లో లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది.
వెనక నుంచి వచ్చి....
కాంచన్ గంగా ఎక్స్ప్రెస్ రైలుకు చెందిన రెండు బోగీలు పట్టాలు తప్పాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు, సహాయక సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ఎక్స్ప్రెస్ పైకి రైలు బోగీ ఎక్కడంతో ప్రమాదం తీవ్రత అర్థం చేసుకోవచ్చు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తెలిసింది. ఘటనా స్థలంలో స్థానికులతో కలసి సహాయక చర్యలను పోలీసులు ప్రారంభించారు. ఆ మార్గంలో రైళ్ల రాకపోకలను నిలిపేశారు. ప్రాధమికంగా ఈ రైలు ప్రమాదంపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
Next Story