Sun Dec 22 2024 23:41:00 GMT+0000 (Coordinated Universal Time)
పట్టాలు తప్పిన రైలు
రైలు పట్టాలు తప్పింది. మధ్య ప్రదేశ్ లోనిని జబల్ పూర్ స్టేషన్ వద్ద ఇండోర్-జబల్ పూర్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది.
రైలు పట్టాలు తప్పింది.మధ్య ప్రదేశ్ లోనిని జబల్ పూర్ స్టేషన్ వద్ద ఇండోర్-జబల్ పూర్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ప్లాట్ఫారం పైకి వెళుతుండగా రెండు బోగీలు పట్టాలు తప్పాయి. దీంతో ప్రయాణికులు ఒకింత ఆందోళనకు గురయ్యారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
ప్రయాణికులంతా క్షేమం...
ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని పేర్కొన్నారు. రైలు ఇండోర్ నుంచి వస్తుండగా ఈ ఘటన జరిగిందని చెప్పారు. రైలు పట్టాలు తప్పిన ఘటనపై ఉన్నతాధికారులు విచారణ ప్రారంభించారు. ఇటీవల వరస రైలు ప్రమాదాలు ప్రయాణికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి
Next Story