Sat Nov 23 2024 00:54:35 GMT+0000 (Coordinated Universal Time)
కాశ్మీర్‌కు రైలు ప్రయాణం.. ఇలా వెళ్లొచ్చు
బెంగళూరు నుంచి కశ్మీర్ వరకూ రైలును దక్షిణ మధ్య రైల్వే శాఖ నడుపుతుంది
బెంగళూరు మీదుగా కశ్మీర్ వరకూ రైలును దక్షిణ మధ్య రైల్వే శాఖ నడుపుతుంది. భారత్ గౌరవ్ పథకంలో భాగంగా ఇండియన్ రైల్వే, ప్రయివేటు టూర్ సంస్థల సహకారంతో ఈ ప్రయోగాన్ని ప్రారంభించింది. వేసవి సెలవుల్లో ఈ రైలు నడపటానికి సిద్ధమయింది. దక్షిణ స్టార్ రైల్ పేరిట ఈ ప్యాకేజీ రైలు మే 11వ తేదీన కోయంబత్తూరు నుంచి ప్రారంభం కానుంది. ఈరోడ్, సేలం, ధర్మపురి, హోసూరు, యలహంక, పెరంబూరు, వరంగల్ మీదుగా ప్రయాణిస్తుందని రైల్వే శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
ఆన్లైన్లో...
టిక్కెట్ ధర ఆన్లైన్లో చూసైుకోవచ్చని పేర్కొంది. టిక్కెట్ ధరతో పాటు భోజన వసతులు, పర్యాటక ప్రాంతం తిరగడం వంటివి ఈ ప్యాకేజీలోనే ఉంటాయని పేర్కొంది. ఆన్లైన్ బుకింగ్ ఇప్పటికే ప్రారంభమైందని రైల్వే టూరిజం డాట్ కామ్ ద్వారా టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చని పేర్కొంది. సీనియర్ల సిటిజన్లకు ఈ రైలులో ప్రత్యేక సౌకర్యాలతో పాటు, సదుపాయాలు కూడా ఉంటాయని తెలిపింది. భారతీయ సంప్రదాయ భోజన సదుపాయాలు కల్పిస్తూ మొత్తం పన్నెండు రోజుల పాటు ఈ రైలు ప్రయాణం సాగుతుందని తెలిపింది.
Next Story