Sun Dec 22 2024 14:25:09 GMT+0000 (Coordinated Universal Time)
24 గంటలలో ట్రాక్ పునరుద్ధరణ.. రైళ్ల రాకపోకలు ప్రారంభం
నిన్న రైలు ప్రమాదం సంభవించిన మార్గంలో రైళ్ల రాకపోకలు ప్రారంభమయ్యాయి
నిన్న రైలు ప్రమాదం సంభవించిన మార్గంలో రైళ్ల రాకపోకలు ప్రారంభమయ్యాయి. 24 గంటలలో ఆ రూట్ లో రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. నిన్న ఉదయం పశ్చిమ బెంగాల్ లోని డార్జిలింగ్ జిల్లాలో కాంచన్జంగా ఎక్స్ ప్రెస్ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. కాంచన్ జంగా ఎక్స్ప్రెస్ ను వెనక నుంచి వచ్చిన రైలు ఢీకొన్న ఘటనలో 9 మంది మరణించారు.
ప్రమాదం జరిగిన...
ఈ ప్రమాదంలో నలభై ఒక్క మంది గాయపడ్డారు. నాలుగు బోగీలు ధ్వంసమయ్యాయి. అయితే నిన్న ఉదయం నుంచి ఆ రూట్ లో రైళ్ల రాకపోకలను నిలిపేశారు. కానీ రైల్వే సిబ్బంది ట్రాక్ పై ఉన్న బోగీలను తొలగించడంతో తిరిగి రైళ్ల రాకపోకలు ఆ రూట్ లో అనుమతించారు. విద్యుత్తు లైన్లను కూడా పునరుద్ధరించారు. ఇరవై నాలుగు గంటల్లోనే ట్రాక్ ను పునురద్ధరించగలిగారు రైల్వే శాఖ సిబ్బంది.
Next Story