Mon Dec 23 2024 10:07:16 GMT+0000 (Coordinated Universal Time)
అయ్యప్ప స్వాములకు గుడ్ న్యూస్.. ఐదు లక్షల బీమా
ఈ ఏడాది అయ్యప్ప భక్తులకు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు గుడ్ న్యూస్ చెప్పింది
ఈ ఏడాది అయ్యప్ప భక్తులకు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది శబరిమలైకు వచ్చే భక్తుల కోసం ఐదు లక్షల రూపాయల బీమా పథకం రూపొందించినట్లు బోర్డు వెల్లడించింది. ఈ మేరకు కేరళ దేవాదాయ శాఖ మంత్రి వి.ఎన్. వాసవన్ తెలిపారు. అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు వచ్చే ప్రతి భక్తునికి ఐదు లక్షల రూపాయల బీమా సౌకర్యాన్ని కల్పించనున్నామని తెలిపారు. ఈసారి భక్తుల రద్దీని కట్టడి చేసేందుకు శబరిమలలో ముందుగానే టిక్కెట్ బుక్ చేసుకున్న వారినే తొలుత అనుమతించేలా ఏర్పాట్లు చేయడంతో కొంత రద్దీని కట్టడి చేయవచ్చని భావిస్తుంది. ఎక్కువ మంది భక్తులు సుదూర ప్రాంతాల నుంచి వస్తుండటం రోడ్డు ప్రమాదాలతో పాటు వివిధ ప్రమాదాలకు లోనై అకస్మాత్తుగా మరణిస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
ప్రమాదవశాత్తూ మరణించే....
ప్రమాదవశాత్తూ మరణించే భక్తులను వారి స్వస్థలాలను చేర్చేందుకు తగిన ఏర్పాట్లను చేయాలని కూడా ట్రావెన్ కోర్ దేవస్థానం ఈ ఏడాది కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి ఏటా అన్నదానం ఉచితంగా ట్రావెన్ కోర్ దేవస్థానం చేస్తుందని, ఈ ఏడాది 20 లక్షల మంది భక్తులు దర్శించుకునే వీలుందని ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు అభిప్రాయపడింది. అయ్యప్ప స్వామి మాల వేసుకుని నలభై రోజులు దీక్ష చేపట్టి శబరిమల వచ్చే భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ఈ ఏడాది మరింత అభివృద్ధి చేయనుంది. ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదాలకు లోనై అనేక మంది మరణిస్తున్నారు. వారి కోసం ఈ బీమా పథకాన్ని ప్రవేశపెట్టినట్లు ట్రావెన్ కోర్ బోర్డు వెల్లడించింది. కేరళ హైకోర్టు తీర్పు మేరకు ట్రావెన్ కోర్టు దేవస్థానం శబరిమలలో పలు మార్పులకు ఈ ఏడాది శ్రీకారం చుట్టింది.
Next Story