Fri Nov 15 2024 21:31:29 GMT+0000 (Coordinated Universal Time)
రాజా ఇక లేడు..!
రాజాకు ఇటీవలి కాలంలో తీవ్రమైన అనారోగ్య లక్షణాలు కనిపించలేదని, అతని మరణానికి
దేశంలో సుదీర్ఘకాలం జీవించిన రికార్డు దక్కించుకున్న పెద్ద పులి రాజా ఇక లేదు. రాజా 25 ఏళ్ల కంటే ఎక్కువే బతికింది. సోమవారం వేకువజామున ఎస్కేబీ(సౌత్ ఖైర్‌బరి) రెస్క్యూ సెంటర్లో రాజా కన్నుమూసినట్లు ఫారెస్ట్ అధికారులు ప్రకటించారు. 2008, ఆగష్టులో నార్త్ బెంగాల్ సుందర్బన్ అడవుల్లో ఓరోజు మొసలితో పోరాడి తీవ్రంగా గాయపడ్డ ఓ రాయల్ బెంగాల్ టైగర్ జాతికి చెందిన రాజాను.. సౌత్ ఖైర్‌బరి టైగర్ రెస్క్యూ సెంటర్‌కు తీసుకొచ్చారు. ఆ సమయంలో అది బతుకుతుందని ఎవరూ అనుకోలేదు. వైద్య బృందం, నిర్వాహకులు శ్రమించి దానిని సాధారణ స్థితికి తీసుకొచ్చారు. ఆ తర్వాత 'రాజా' దాదాపు పదిహేనేళ్లు బతికింది. దేశంలో సుదీర్ఘ కాలం జీవించిన పెద్దపులిగా రాజా నిలిచించి. రాజా 25 ఏళ్ల 10 నెలలు బతికి రికార్డుకెక్కింది.
రాజాకు ఇటీవలి కాలంలో తీవ్రమైన అనారోగ్య లక్షణాలు కనిపించలేదని, అతని మరణానికి వృద్ధాప్య సంబంధిత సమస్యలు అకస్మాత్తుగా బయటపడవచ్చని భావిస్తున్నట్లు చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్ దేబల్ రాయ్ పిటిఐకి తెలిపారు. రాజా దేశంలోనే అత్యంత పురాతనమైన రాయల్ బెంగాల్ టైగర్ అని అధికారికంగా నిర్ధారించలేకపోయినప్పటికీ.. ఇవి సాధారణంగా 20 ఏళ్లకు మించి జీవించవు. అనేక ప్రామాణిక ప్రోటోకాల్‌ల ఆధారంగా 2008లో రాజా వయస్సు 12 ఉండేదని మరో అటవీ అధికారి తెలిపారు. రాజా తన కీపర్లు, పశువైద్యుల పిలుపుకు ప్రతిస్పందించేవాడని చెప్పుకొచ్చారు.
News Summary - Tributes pour in after demise of Raja, world’s oldest tiger in captivity
Next Story