Tue Nov 05 2024 11:30:33 GMT+0000 (Coordinated Universal Time)
కూలిన ప్రముఖ ఆలయ గోపురం
గతంలో గోపురాన్ని పటిష్టం చేసి పునరుద్ధరించేందుకు రూ.67 లక్షలు మంజూరు చేశాం. ఇటీవలే రూ. 98 లక్షలకు సవరించా
తమిళనాడు రాష్ట్రం తిరుచ్చి జిల్లాలోని ప్రసిద్ధ శ్రీరంగం ఆలయంలోని గోపురాలలో ఒక భాగం కూలిపోయింది. శనివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. తూర్పు వైపు ఉన్న గోపురం ద్వారం కూలిపోయింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కూలిన వెంటనే ఆలయ అధికారులు పునరుద్ధరణ పనులు ప్రారంభించారు. తెల్లవారుజామున 2 గంటల సమయంలో చోటు చేసుకుంది. సాధారణంగా స్థానికులు ఇక్కడ నుండి తమ నివాస ప్రాంతాలకు చేరుకోవడానికి గోపురం ప్రవేశద్వారాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.
కొద్ది రోజుల క్రితమే గోపురం పునరుద్ధరణ పనులకు రూ.98 లక్షలు అంచనా వేశామని ఆలయ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఆలయ నిర్మాణాలపై ఉన్న పగుళ్లపై గతంలో ఆలయ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు స్థానికులు తెలిపారు. గతంలో గోపురాన్ని పటిష్టం చేసి పునరుద్ధరించేందుకు రూ.67 లక్షలు మంజూరు చేశాం. ఇటీవలే రూ. 98 లక్షలకు సవరించామని అధికారులు తెలిపారు. పునరుద్ధరణ పనులు త్వరలోనే మొదలుపెట్టనున్నామని తెలిపారు. శనివారం ఉదయం ఆలయ సిబ్బంది చెత్తాచెదారాన్ని తొలగించి, గోపురం చుట్టుపక్కల ప్రజల రాకపోకలను అడ్డుకున్నారు. శ్రీరంగంలోని రంగనాథస్వామి ఆలయం 156 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఆలయ ప్రాంతంలో మొత్తం 21 గోపురాలు ఉన్నాయి. 81 మందిరాలు, 39 మండపాలు ఉన్నాయి. ఈ ఆలయాన్ని రోజూ వేళల్లో సందర్శిస్తూ ఉంటారు. తమిళనాడు లోని ప్రముఖ ఆలయాన్ని శ్రీరంగం కూడా ఒకటి.
Next Story