Sun Dec 22 2024 08:13:15 GMT+0000 (Coordinated Universal Time)
కోల్ కత్తా టీఎంసీదే
కోల్ కత్తా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ వన్ సైడ్ విజయం సాధించే దిశాగా వెళుతుంది.
కోల్ కత్తా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ వన్ సైడ్ విజయం సాధించే దిశాగా వెళుతుంది. మొత్తం 144 వార్డులున్న కోల్ కత్తా మున్సిపల్ కార్పొరేషన్ లో ఇప్పటి వరకూ దాదాపు పది స్థానాల్లో విజయం సాధించింది. మరో వందకు పైగా స్థానాల్లో టీఎంసీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఇక్కడ విపక్ష బీజేపీ సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యే అవకాశాలున్నాయి.
మిగిలిన పార్టీలు....
ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం కేవలం నాలుగు వార్డుల్లోనే బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థులు మూడు చోట్ల, కాంగ్రెస్, వామపక్షాలు చెరి రెండు చోట్ల లీడ్ లో ఉన్నాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే టీఎంసీ క్లీన్ స్వీప్ దిశగా కోల్ కత్తా మున్సిపల్ ఎన్నికల కార్పొరేషన్ లో దూసుకుపోతుంది.
Next Story