Sat Nov 23 2024 06:53:37 GMT+0000 (Coordinated Universal Time)
మరో 12 చీతాలు వచ్చేస్తున్నాయ్
భారత్ కు మరో పన్నెండు చీతాలు వస్తున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నమీబియా దేశం నుంచి తీసుకు వస్తుంది
భారత్ కు మరో పన్నెండు చీతాలు వస్తున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నమీబియా దేశం నుంచి తీసుకు వస్తుంది. ఈరోజు వాయుమార్గంలో మరికాసేపట్లో భారత్ కు 12 చీతాలు చేరుకోనున్నాయి. చీతాలను తెచ్చేందుకు సీ -17 విమానాన్ని ఉపయోగిస్తున్నారు. గురువారమే బయలుదేరిన విమానం మరికాసేపట్లో భారత్ కు చేరుకోనుంది.
కూనో పార్క్ లో...
గత ఏడాది సెప్టంబరు 17న ప్రధాని తన పుట్టినరోజు సందర్భంగా చీతాలను తెచ్చి కూనో పార్కులో వదిలేశారు. వీటిలో ఐదు ఆడ, మూడు మగ చీతాలున్నాయి. ఇప్పుడు మరో పన్నెండు చీతాలను తెప్పిస్తున్నారు. 1948లో అంతరించిపోయిన చీతాలను తిరిగి భారత్ లో పెంచాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. పదేళ్ల పాటు ఏటా 12 చీతాలను తీసుకొచ్చి అడవుల్లో వదిలేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. ఈ పన్నెండు చీతాలను కూడా మధ్యప్రదేశ్ లోని కూనో జాతీయ పార్కులో వదిలేయనున్నారు.
Next Story