Sun Dec 22 2024 22:34:24 GMT+0000 (Coordinated Universal Time)
భారతీయ ఉద్యోగులకు షాకిచ్చిన మస్క్.. భారీగా తొలగింపులు
శుక్రవారం ఎక్కువ మంది భారతీయుల్ని తొలగించారు. ట్విట్టర్ ఇండియా ఆఫీస్ నుంచి భారీ స్థాయిలో ఉద్యోగుల్ని వారి సిస్టమ్స్..
ట్విట్టర్ ను తిరిగి తన చేజిక్కించుకున్న ఎలాన్ మస్క్.. ఉద్యోగులపై వేటు వేసే పనిలో ఉన్నారు. మస్క్ తీసుకున్న ఈ నిర్ణయంతో భారతీయ ఉద్యోగులు.. ఉపాధి కోల్పోయారు. శుక్రవారం ఎక్కువ మంది భారతీయుల్ని తొలగించారు. ట్విట్టర్ ఇండియా ఆఫీస్ నుంచి భారీ స్థాయిలో ఉద్యోగుల్ని వారి సిస్టమ్స్ నుంచి లాగౌట్ చేయించారు. శుక్రవారం సాయంత్రంలోపు తమ ఉద్యోగాల్ని వదులుకోవాలని కంపెనీ ఆదేశించింది. దీంతో చాలా మంది తీవ్ర వేదనకు గురయ్యారు. ఉన్నట్టుండి, ఒక్క రోజులోనే ఇలాంటి ఆదేశాలు రావడంతో చాలా మంది కన్నీళ్లు పెట్టుకున్నారు.
కేవలం భారతీయులకే కాదు.. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఉద్యోగులకు ట్విట్టర్ ఇలాంటి ఈమెయిల్స్ పంపింది. విధుల్లో నుండి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. తమను ఉద్యోగంలోంచి ఉన్నపళంగా తొలగించడంపై అనేక మంది ట్విట్టర్ వేదికగా తమ వేదన పంచుకుంటున్నారు. అతి తక్కువ మంది ట్విట్టర్ ను వదిలినందుకు సంతోషపడుతున్నారు. ఇండియా నుండి ఎంతమంది ట్విట్టర్ ఉద్యోగులపై వేటు వేశారో స్పష్టత రావాల్సి ఉంది.
Next Story