Mon Dec 23 2024 04:02:09 GMT+0000 (Coordinated Universal Time)
మళ్లీ ఉద్యోగులను తొలగించిన మస్క్.. బ్లూ టిక్ ఇన్ఛార్జ్ సహా
తమను ఉద్యోగం నుంచి తొలగించినట్టు ఈమెయిల్స్ వచ్చాయని కొందరు తెలిపారు. ఇంటర్నల్ సిస్టమ్ లోకి లాగిన్ కాలేకపోయామని..
ఎలాన్ మస్క్ సీఈఓగా ట్విట్టర్ బాధ్యతలను చేపట్టినప్పటి నుంచి ఆ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు షాకులు తప్పట్లేదు. ఎప్పుడు ఉద్యోగం పోతుందోనని దినదిన గండంగా పనిచేస్తున్నారు. కంపెనీ పగ్గాలను అందుకున్న వెంటనే వేలమంది ఉద్యోగులకు ఉద్వాసన పలికిన మస్క్.. మరోసారి కంపెనీలో లేఆఫ్ లను ప్రకటించాడు. ఈ సారి ఇంజినీరింగ్, ప్రాడక్ట్ విభాగాల్లో ఉద్యోగులను తొలగించాడు.
తమను ఉద్యోగం నుంచి తొలగించినట్టు ఈమెయిల్స్ వచ్చాయని కొందరు తెలిపారు. ఇంటర్నల్ సిస్టమ్ లోకి లాగిన్ కాలేకపోయామని.. దీంతో తమను తొలగించారనే విషయాన్ని అర్థం చేసుకున్నామని మరికొందరు ఉద్యోగులు తెలిపారు. తాజాగా జరిగిన లే ఆఫ్ లలో కంపెనీ ఎగ్జిక్యూటివ్ హోదాలో పని చేస్తున్న ఎస్తర్ క్రాఫోర్డ్ కూడా ఉన్నారు. సబ్ స్క్రిప్షన్ సర్వీస్ బ్లూటిక్ ఇన్ఛార్జ్ గా ఆయన వ్యవహరిస్తున్నారు. కాగా.. ఉద్యోగుల తొలగింపులపై స్పందించాలని బ్లూంబర్గ్ కామెంట్ చేయగా.. ట్విట్టర్ అందుకు స్పందించలేదు.
Next Story