Sun Dec 22 2024 17:14:09 GMT+0000 (Coordinated Universal Time)
భారత్ లో రెండు ట్విట్టర్ కార్యాలయాలు మూసివేత..
2023 కల్లా సంస్థకు ఆర్థిక స్థిరత్వం ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.ఈ క్రమంలో శాన్ ఫ్రాన్సిస్కో లోని..
ఎలాన్ మస్క్ ట్విట్టర్ పగ్గాలు చేపట్టినప్పటి నుండి అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఉద్యోగులను తొలగించడం నుంచి.. మొన్న తన పెంపుడు కుక్కను సీఈఓ గా ప్రకటించడం వరకూ.. మస్క్ నిర్ణయాలు నెటిజన్లను ఆగ్రహానికి గురిచేస్తున్నాయి. ట్విట్టర్లో ఖర్చులు తగ్గించుకునే దిశగా.. కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న మస్క్ అభిమతానికి అనుగుణంగా భారత్ లో రెండు ట్విట్టర్ కార్యాలయాలు మూతపడ్డాయి. దేశ రాజధాని ఢిల్లీలో, ఆర్థిక రాజధాని ముంబై నగరాల్లోని ఆఫీసులను మూసివేశారు. ప్రస్తుతం బెంగళూరులో ఉన్న ఒకేఒక్క కార్యాలయం విధులు నిర్వర్తిస్తోంది.
ట్విట్టర్ను చేజిక్కించుకున్నాక మస్క్.. సంస్థను లాభాల బాట పట్టించేందుకు విశ్వప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. 2023 కల్లా సంస్థకు ఆర్థిక స్థిరత్వం ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.ఈ క్రమంలో శాన్ ఫ్రాన్సిస్కో లోని కార్యాలయంలో ఉపయోగంలో లోని సామాన్లను ఓ సంస్థ ద్వారా వేలం వేసి అమ్మేశారు. గతేడాది ఇండియాలో సుమారు 200 మంది సిబ్బందిని తొలగించింది. సంస్థ మొత్తం సిబ్బందిలో వీరి వాటా సుమారు 90 శాతం ఉంటుందని సమాచారం. బెంగళూరు శాఖలోని సిబ్బందిలో అత్యధికులు సాఫ్ట్వేర్ ఇంజినీర్లేనని తెలుస్తోంది. భారత్ లో ట్విట్టర్ వాడుతున్న ప్రముఖులందరిలోకెల్లా ప్రధాని మోదీకే ఫాలోవర్లు ఎక్కువగా ఉన్నారు. ఆయనను ఏకంగా 86.5 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.
Next Story