Sun Dec 22 2024 22:54:58 GMT+0000 (Coordinated Universal Time)
మళ్లీ డౌనైన ట్విట్టర్.. రెండు గంటలపాటు పనిచేయని లాగిన్లు
ట్విట్టర్ ఇలా డౌనవ్వడం ఈ నెలల ఇది రెండోసారి. డిసెంబర్ 11న కూడా యూజర్లు ఇలాంటి ఇబ్బందులే ఎదుర్కొన్నారు.
ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ వెబ్ వెర్షన్ లాగిన్ లో గురువారం ఉదయం సమస్యలు తలెత్తాయి. చాలా మంది యూజర్లు తమ అకౌంట్ కు లాగిన్ అవ్వలేక ఇబ్బంది పడ్డారు. ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకూ 9 వేల మందికిపైగా వినియోగదారులు తాము లాగిన్ కాలేకపోయామంటూ.. సమస్యలను వెల్లడించారు. లాగిన్ చేసేందుకు ప్రయత్నించగా.. ఎర్రర్ అని చూపించిందని, యూజర్ నేమ్ అండ్ పాస్ వర్డ్ ఎంటర్ చేశాక సైట్ ఓపెన్ కాలేదని తెలిపారు.
డౌన్ డెటెక్టర్ ప్రకారం.. దేశంలోని ఢిల్లీ, హైదరాబాద్, ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా సహా పలు నగరాల్లో ఈ సమస్య తలెత్తినట్లు ఆయా ప్రాంతాల యూజర్లు పేర్కొంటున్నారు. ట్విట్టర్ ఇలా డౌనవ్వడం ఈ నెలల ఇది రెండోసారి. డిసెంబర్ 11న కూడా యూజర్లు ఇలాంటి ఇబ్బందులే ఎదుర్కొన్నారు. ట్విట్టర్ పగ్గాలను మస్క్ చేపట్టిన తర్వాత ఇలాంటి సాంకేతిక సమస్య తలెత్తడం ఇది మూడోసారి. ప్రస్తుతం ప్లే స్టోర్‌లో ఎలాంటి సమస్య లేనప్పటికీ, ఆండ్రాయిడ్ ప్లాట్ ఫారమ్‌లో మాత్రమే ట్విటర్ డౌన్ అవుతుందని పలువురు వినియోగదారులు పేర్కొంటున్నారు. ఇక ఈ ఏడాది మస్క్ వచ్చాక.. అనేక మంది ట్విట్టర్ ఉద్యోగులకు ఉద్వాసన పలికారు. ఆ తర్వాత ట్విట్టర్ వెరిఫికేషన్ టిక్ విషయంలో పలు మార్పులు చేశారు.
Next Story