Sun Dec 22 2024 22:34:00 GMT+0000 (Coordinated Universal Time)
Koo VS Twitter : "కూ" ఖాతాను తొలగించిన ట్విట్టర్
ట్విట్టర్లో తమ అధికారిక ఖాతాను తొలగించడంపై ‘కూ’ సహ వ్యవస్థాపకుడు మయాంక్ బిదావత్కా #ElonIsDestroyingTwitter ..
ప్రముఖ భారతీయ మైక్రోబ్లాగింగ్ సైట్ "కూ" కు సంబంధించిన అధికారిక ఖాతాను ట్విట్టర్ తన ప్లాట్ ఫాం నుండి తొలగించింది. ట్విట్టర్ విదేశీ సోషల్ మీడియా ప్లాట్ ఫాం అని తెలిసిందే. అలాంటి వాటికి ధీటుగా "కూ"ను రూపొందించారు. "కూ"కు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ఖాతాను తొలగించినట్లు ఆ సంస్థవారు అభిప్రాయపడుతున్నారు. తాజాగా.. ట్విట్టర్ సీఈవో ఎలాన్ మస్క్ న్యూ యార్క్ టైమ్స్, సీఎన్ఎన్, వాషింగ్టన్ పోస్ట్ వంటి సంస్థలు సహా పలు మీడియా సంస్థలకు చెందిన ప్రసిద్ధ జర్నలిస్టుల ఖాతాలను సస్పెండ్ చేయించారు. ఇదే సమయంలో 'కూ' ఖాతాను కూడా సస్పెండ్ చేయడం గమనార్హం.
ట్విట్టర్లో తమ అధికారిక ఖాతాను తొలగించడంపై 'కూ' సహ వ్యవస్థాపకుడు మయాంక్ బిదావత్కా #ElonIsDestroyingTwitter ట్యాగ్ వాడుతూ ట్వీట్ చేశారు. తమకు సంబంధించిన సమాచారం పోస్టు చేయడంలో తప్పులేదన్నారు. జర్నలిస్టులు లింకులు పోస్టు చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. కనీస సమాచారం లేకుండా.. ఎలాన్ ఇలాంటి చర్యలు తీసుకోవడం సరికాదని హితవు పలికారు. ట్విట్టర్ తీరు ప్రజాస్వామ్యబద్ధంగా లేదని విమర్శించారు. ట్విట్టర్ ఇకపై ఒక ప్రచురణ కర్తగా ఉంటుందే తప్ప.. ఒక వేదికగా తన ఉనికిని కోల్పోతుందన్నారు. మాస్టోడాన్ ఖాతాను నిషేధించడం, దాని లింకులు సురక్షితం కాదని అనడం, కూ ఖాతాను నిషేధించడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నానని అన్నారు.
Next Story