Mon Nov 18 2024 04:15:30 GMT+0000 (Coordinated Universal Time)
ట్రైన్ లో పిడకలతో చలిమంట వేసుకున్నారు
చిన్న నిప్పు రవ్వ కారణంగా ట్రైన్ లు తగలబడుతున్న ఘటనల గురించి తెలిసి మనం
చిన్న నిప్పు రవ్వ కారణంగా ట్రైన్ లు తగలబడుతున్న ఘటనల గురించి తెలిసి మనం షాక్ అవుతూ ఉంటాం! అలాంటిది కొందరు కదులుతున్న ట్రైన్ లో చలి మంట వేసుకున్నారు. న్యూఢిల్లీకి వెళ్లే సంపర్క్ క్రాంతి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ కంపార్ట్మెంట్ నుండి పొగలు వస్తున్నాయని గేట్‌మ్యాన్ అధికారులను హెచ్చరించాడు. అయితే అందుకు కారణం ఆ రైలులో మంటలు వెలిగించడమే.. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) అధికారి ఒకరు తెలిపారు.అలీఘర్ వద్ద, జనవరి 3 రాత్రి బర్హాన్ రైల్వే స్టేషన్ సమీపంలోని రైల్వే క్రాసింగ్ వద్ద పోస్ట్ చేసిన గేట్‌మ్యాన్ అస్సాం నుండి వస్తున్న రైలులో పొగను గమనించడంతో పెను ప్రమాదం తప్పింది.
గేట్‌మ్యాన్ వెంటనే బర్హాన్ రైల్వే స్టేషన్‌లోని ఉన్నతాధికారులకు సమాచారం అందించాడు. ఆ తర్వాత ఒక RPF బృందం రైలును చమ్రౌలా వద్ద ఆపారు. ఆ సమయంలో రైలులో కొందరు వ్యక్తులు మంటలు వెలిగించినట్లు వారు కనుగొన్నారు. విపరీతమైన చలి నుండి ఉపశమనం పొందడానికి కోచ్ లోపల పిడకలతో మంటలను వెలిగించారు. పెద్ద ప్రమాదం జరగకముందే మంటలను ఆర్పివేశారు. రైలు అలీఘర్ జంక్షన్‌కు చేరుకున్నాక 16 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఫరీదాబాద్‌కు చెందిన చందన్ (23), దేవేంద్ర (25) అనే ఇద్దరు యువకులు మంటలు వెలిగించినట్లు అంగీకరించారని అలీఘర్ రైల్వే స్టేషన్ ఆర్పిఎఫ్ కమాండెంట్ రాజీవ్ వర్మ తెలిపారు. వారిపై ఐపీసీ, ఇండియన్ రైల్వే చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి జైలుకు పంపారు. మరో 14 మంది సహ ప్రయాణీకులను హెచ్చరించి అధికారులు విడుదల చేశారు.
Next Story