Mon Dec 23 2024 18:43:58 GMT+0000 (Coordinated Universal Time)
అలర్ట్ : డ్రా చేస్తే ఇప్పుడు రెండు వేల నోట్లు
రెండు వేల నోట్లు ఇప్పటి వరకూ ఏటీఎంల నుంచి రాలేదు. బ్యాంకులు కూడా జారీ చేయడం మానేశాయి
రెండు వేల నోట్లు ఇప్పటి వరకూ ఏటీఎంల నుంచి రాలేదు. బ్యాంకులు కూడా జారీ చేయడం మానేశాయి. గత రెండేళ్లుగా రెండు వేల నోటు కనపడకుండా పోయింది. అయితే ఈరోజు ఉదయం నుంచి ఏటీఎంలలో రెండు వేల నోట్లు వస్తున్నాయి. డిపాజిట్ మెషిన్లలో నిన్న సాయంత్రం నుంచి రెండువేల నోట్లు డిపాజిట్ అధిక మొత్తంలో చేస్తున్నారు. సెప్టంబరు 30వ తేదీ వరకూ గడువు ఉన్నప్పటికీ తమ వద్ద ఉన్న రెండు వేల నోటును వదిలించుకునేందుకు ఏటీఎంలలోని డిపాజిట్ మెషిన్లలో జమ చేస్తున్నారు.
డిపాజిట్ చేయడంతో...
దీంతో కొందరు ఇది తెలియక డబ్బులు విత్ డ్రా డిపాజిట్ మెషిన్ నుంచి చేస్తున్నారు. వారికి రెండు వేల నోట్లు వస్తున్నాయి. దీంతో అదిరిపోవడం వారి వంతయింది. ఇన్నాళ్లూ కాన రాని రెండు వేల నోటు ఇప్పుడు వస్తుండటం, వారు విత్ డ్రా చేయడంతో ఇక తప్పనిసరిగా వారు కూడా అదే మిషన్లో జమ చేయాల్సి వస్తుంది. కొందరు బ్యాంకుల వద్దకు పరుగులు తీస్తున్నారు. కొన్ని రోజుల పాటు ఏటీఎంల నుంచి డబ్బు విత్ డ్రా చేయకపోవడమే బెటర్ అన్న కామెంట్స్ వినపడుతున్నాయి.
Next Story