Tue Dec 24 2024 16:06:56 GMT+0000 (Coordinated Universal Time)
నేడు ఆఖరి గడువు
నేటితో రెండు వేల రూపాయల నోట్లు రద్దవుతున్నాయి. బ్యాంకుల్లో డిపాజిట్ చేయడానికి ఈరోజే ఆఖరి గడువు
నేటితో రెండు వేల రూపాయల నోట్లు రద్దవుతున్నాయి. బ్యాంకుల్లో డిపాజిట్ చేయడానికి ఈరోజే ఆఖరి గడువు. కేంద్ర ప్రభుత్వం రెండు వేల నోట్లను రద్దు చేసిన తర్వాత దానిని తమ ఖాతాల్లో డిపాజిట్ చేసేందుకు కొంత గడువు ఇచ్చింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూచనల మేరకు ఈరోజు వరకూ మాత్రమే గడువు ఉంది.
వెయ్యి నోటు స్థానంలో...
దీంతో ఈరోజుతో రెండు వేల నోట్లు పూర్తిగా రద్దు కానున్నాయి. బ్యాంకుల్లో డిపాజిట్లకు చివరి గడువు కావడంతో ఎంతమంది తమ ఖాతాల్లో రెండు వేల రూపాయలను డిపాజిట్లు చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. 2016లో వెయ్యి రూపాయల నోటును రద్దు చేసిన ఆర్బీఐ దాని స్థానంలో రెండు వేల రూపాయల నోటును ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఈరోజుతో రెండు వేల నోటుకు కూడా కాలం చెల్లినట్లే.
Next Story