Mon Dec 23 2024 17:02:18 GMT+0000 (Coordinated Universal Time)
ఉదయపూర్ హత్య కేసులో షాకింగ్ విషయాలు
రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్‌లో టైలర్ దారుణహత్య దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఇద్దరు వ్యక్తులు టైలర్ షాపులోకి వచ్చి.. టైలర్‌ను గొంతు కోసి దారుణంగా చంపేశారు.
రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్‌లో టైలర్ దారుణహత్య దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఇద్దరు వ్యక్తులు టైలర్ షాపులోకి వచ్చి.. టైలర్‌ను గొంతు కోసి దారుణంగా చంపేశారు. ఈ హత్య తరువాత ఉదయ్‌పూర్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. హంతకులకు కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తూ ర్యాలీ తీశారు. హత్య చేసిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరు హంతకులు ఈ మర్డర్ తరువాత వీడియో కూడా రిలీజ్ చేశారు. గౌస్ మహ్మద్ , మహ్మద్ రియాజ్ అనే వ్యక్తులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఈ ఘటన తరువాత రాజస్థాన్‌లో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. ఉదయ్‌పూర్‌లో దుకాణాలను మూసేశారు.
హత్యకు గురైన టైలర్ కన్హయ్య లాల్ సాహుకు 5 రోజుల క్రితం బెదిరింపులు వచ్చాయని తెలుస్తోంది. తనకు వచ్చిన బెదిరింపులపై స్థానిక పోలీసులకు కన్హయ్య లాల్ ఫిర్యాదు చేశాడు. భయంతో ఐదు రోజుల పాటు షాపు కూడా తెరవలేదు. రక్షణ కల్పించాలని కన్హయ్య లాల్ కోరినా పోలీసులు పట్టించుకోలేదు. ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు స్పందిస్తే ఈ దారుణం జరిగేది కాదని చెబుతున్నారు. పోలీసుల వైఫల్యం వల్లే దుండగులు టైలర్ ను దారుణంగా హత్య చేశారనే ఆరోపణలు వస్తున్నాయి.
ఈ ఘటనను తన సెల్ ఫోన్ లో రికార్డ్ చేశారు నిందితులు. పదునైన కత్తితో తలను వేరు చేయడంతో టైలర్ స్పాట్ లోనే చనిపోయాడు. తర్వాత ఇద్దరు దుండగులు తామే హత్య చేశామంటూ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో నిమిషాల్లోనే వైరల్ గా మారింది. దేశ వ్యాప్తంగా ప్రకంపనలు రేపింది. టైలర్ హత్య ముందస్తు ప్లాన్ ప్రకారమే జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. హత్యకు పాల్పడిన నిందితులు ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉదయ్ పూర్ లో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. రాజస్థాన్ లో ఇంటర్ నెట్ సేవలను నిలిపివేశారు. ఉదయ్ పూర్ లో కర్ఫ్యూ విధించారు. రాజస్థాన్ మొత్తం 144 సెక్షన్ విధించారు.
Next Story