Mon Dec 23 2024 17:55:46 GMT+0000 (Coordinated Universal Time)
"మోదీని చంపేస్తా".. కంట్రోల్ రూమ్ కి బెదిరింపు కాల్
ఢిల్లీకి చెందిన హేమంత్ కుమార్ ఆ ఫోన్ కాల్ చేసినట్లు గుర్తించారు. అతను ప్రస్తుతం నిరుద్యోగిగా ఉన్నట్లు తెలుస్తోంది.
భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీకి బెదిరింపు కాల్ వచ్చింది. తాజా సమాచారం ప్రకారం.. గత రాత్రి గుర్తు తెలియని వ్యక్తి పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేశాడు. ఫోన్ లో మాట్లాడిన అతడు ప్రధాని నరేంద్ర మోదీని చంపేస్తానని బెదిరించి కాల్ కట్ చేశాడు. ఈ బెదిరింపు కాల్ ను సీరియస్ గా తీసుకున్న పోలీసుల బృందం రంగంలోకి దిగి ఆ కాల్ ను ట్రేస్ చేసింది.
ఢిల్లీకి చెందిన హేమంత్ కుమార్ ఆ ఫోన్ కాల్ చేసినట్లు గుర్తించారు. అతను ప్రస్తుతం నిరుద్యోగిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఉద్యోగం లేక కొంతకాలంగా మద్యానికి బానిసైన అతను.. మద్యం మత్తులోనే ఈ బెదిరింపు కాల్ చేశాడని చెబుతున్నారు. ప్రధాని మోదీ ప్రభుత్వం.. నిరుద్యోగులకు అర్హతకు తగిన ఉద్యోగాలివ్వడంలో ఫెయిల్ అయిందన్న కారణంతో.. హేమంత్ మనస్తాపం చెంది మోదీని చంపేస్తానంటూ ఫోన్ చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. హేమంత్ ను పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు.
Next Story