Tue Nov 26 2024 08:11:17 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో పెరుగుతోన్న నిరుద్యోగుల ఆత్మహత్యలు
కేంద్ర కార్మికశాఖ సహాయమంత్రి రామేశ్వర్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. గడిచిన ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ లో 294 మంది నిరుద్యోగులు
న్యూ ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ లో గడిచిన మూడేళ్లుగా నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరుగుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు సోమవారం జరిగిన పార్లమెంట్ సమావేశంలో ప్రకటన చేసింది. కేంద్ర కార్మికశాఖ సహాయమంత్రి రామేశ్వర్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. గడిచిన ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ లో 294 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు ఆయన వివరించారు. 2017లో 55 మంది, 2016లో 36, 2017లో 55, 2018లో 44, 2019లో 71 మంది, 2020లో 88 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారని రామేశ్వర్ తెలిపారు.
తెలంగాణ నిరుద్యోగుల ఆత్మహత్యల్లో హెచ్చుతగ్గులు ఉన్నట్లు కేంద్ర సహాయమంత్రి రామేశ్వర్ తెలిపారు. గత ఐదేళ్లలో తెలంగాణ వ్యాప్తంగా 188 మంది నిరుద్యోగులు చనిపోయినట్లు ఆయన ప్రకటించారు. 2016లో 24 మంది, 2017లో 45 మంది, 2018లో 40 మంది, 2019లో 56 మంది, 2020లో 23 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నట్లు వివరించారు.
Next Story