Mon Dec 23 2024 17:02:05 GMT+0000 (Coordinated Universal Time)
ఒవైసీ కాన్వాయ్ పై కాల్పులు
ఎంఐఎం అధినేత అసుద్దీన్ ఒవైసీ కాన్వాయ్ పై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు
ఎంఐఎం అధినేత అసుద్దీన్ ఒవైసీ కాన్వాయ్ పై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఉత్తర్ ప్రదేశ్ లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. గత కొద్ది రోజులుగా ఉత్తర్ ప్రదేశ్ లో ఎంఐఎం అభ్యర్థులకు మద్దతుగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ప్రచారం ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ కాల్పులు జరిగినట్లు తెలిసింది. మీరట్ లో రోడ్ షోలో పాల్గొని తిరిగి వస్తుండగా టోల్ గేట్ సమీపంలో ఈ కాల్పులు జరిగినట్లు ఒవైసీ తెలిపారు.
సురక్షితంగానే ఉన్నా....
ముగ్గురు వ్యక్తులు తన కాన్వాయ్ పై కాల్పులు జరిపినట్లు అసుద్దీన్ ఒవైసీ ట్వీట్ చేశారు. మూడు నుంచి నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో అసదుద్దీన్ ఒవైసీ కార్లు టైర్లు పేలాయి. మరో కారులో ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. తాను క్షేమంగానే ఉన్నానని అసదుద్దీన్ ఒవైసీ ట్వీట్ చేశారు. ప్రస్తుతం అసుదుద్దీన్ ఒవైసీ క్షేమంగా ఢిల్లీకి చేరుకున్నారు.
Next Story