Wed Dec 18 2024 18:54:39 GMT+0000 (Coordinated Universal Time)
ఈ షాంపూల్లో క్యాన్సర్ కారకాలు.. భారీ మొత్తంలో రీకాల్ చేసిన యూనిలీవర్
ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వెబ్సైట్లో రీకాల్ వివరాలను అక్టోబర్ 18న యూనిలీవర్ ప్రకటించింది. తమ అంతర్గత పరిశోధనలో..
ప్రముఖ ఎఫ్ఎంసీజీ సంస్థ యూనిలివర్ షాంపూలను వాడే వారికి షాకింగ్ న్యూస్ చెప్పింది. తన డ్రై షాంపూ ఉత్పత్తులైన డవ్, ట్రెస్మే, నెక్సస్, సువావే, టిగీ లాంటి షాంపూల్లో క్యాన్సర్ కారక కెమికల్ అయిన బెంజిన్ అధిక మోతాదులో ఉన్నట్లు తాజా పరిశోధనల్లో గుర్తించింది. వెంటనే మార్కెట్లో ఉన్న ఆయా షాంపూలన్నింటినీ రీకాల్ చేసింది. లుషితమైన ఏరోసోల్ డ్రై షాంపూ ఉత్పత్తులు ప్రమాదకరమని, వాటిని వాడొద్దని వినియోగదారులను హెచ్చరించింది. 2021 అక్టోబర్ 18కి ముందు తయారు చేసిన షాంపూల్లో హానికర క్యాన్సర్ కారకాలున్నట్లు యూనిలీవర్ వెల్లడించింది.
ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వెబ్సైట్లో రీకాల్ వివరాలను అక్టోబర్ 18న యూనిలీవర్ ప్రకటించింది. తమ అంతర్గత పరిశోధనలో ఏరోసోల్స్ ప్రొపెల్లెంట్ కేన్సర్ కారకం బెంజీన్కు మూలమని కనుగొన్నట్లు తెలిపింది. వీటి వాడకంతో బెంజీన్ స్థాయిలు పెరిగే అవకాశం ఉన్నందున అమెరికాలో పంపిణీ చేసిన ఉత్పత్తులు అన్నింటినీ రీకాల్ చేశామనీ, ఆయా ఉత్పత్తులను షెల్ఫ్‌ల నుండి తీసివేయమని రిటైలర్లను కోరింది. బెంజీన్ అధిక స్థాయిలో శరీరంలో చేరితే లుకేమియా, ప్రాణాంతక రక్త రుగ్మతలు, బోన్ మారో క్యాన్సర్ వంటి క్యాన్సర్ల ప్రమాదాన్ని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు.
Next Story