Sat Nov 23 2024 00:43:51 GMT+0000 (Coordinated Universal Time)
కేంద్ర బడ్జెట్ లో తెలుగు రాష్ట్రాలకు కేటాయించిన వివరాలు
దేశంలోని ఎయిమ్స్ ఆస్పత్రులకు రూ.6835 కోట్లు ప్రకటించగా.. బీబీ నగర్, మంగళగిరి ఎయిమ్స్ ఆస్పత్రులు కూడా..
నేడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 7 అంశాలతో కూడిన బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్ లో వివిధ రంగాలకు కేటాయింపులు ప్రకటించారు. దేశంలోని ఎయిమ్స్ ఆస్పత్రులకు రూ.6835 కోట్లు ప్రకటించగా.. బీబీ నగర్, మంగళగిరి ఎయిమ్స్ ఆస్పత్రులు కూడా నిధులను అందుకోనున్నాయి. సాలార్ జంగ్ మ్యూజియం సహా.. అన్ని మ్యూజియంలకు రూ.357 కోట్లను కేటాయించారు. అలాగే.. మణుగూరు, కోట భారజల కర్మాగారాలకు రూ.1473 కోట్లు కేటాయించారు.
అటు.. సింగరేణికి కేంద్ర బడ్జెట్ లో రూ.1,650 కోట్లు కేటాయించారు. ఐఐటీ హైదరాబాద్ కు ఈఏపీ కింద రూ.300 కోట్లు కేటాయించారు. ఈసారి కేంద్ర బడ్జెట్ లో విశాఖ ఉక్కు పరిశ్రమకు రూ.683కోట్లు, ఏపీలో పెట్రోలియం యూనివర్సిటీకి రూ.168 కోట్లు ఇస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లో గిరిజన వర్సిటీలకు రూ.37 కోట్లు అందించనున్నారు. ఇక, కేంద్ర పన్నుల్లో తెలంగాణ వాటా రూ.21,470 కోట్లు కాగా.. ఆంధ్రప్రదేశ్ వాటా రూ.41,338 కోట్లు అని బడ్జెట్ లో పేర్కొన్నారు.
Next Story