Sun Dec 22 2024 22:59:01 GMT+0000 (Coordinated Universal Time)
నేడు కేంద్ర మంత్రి వర్గ సమావేశం
నేడు ఢిల్లీలో కేంద్ర మంత్రి వర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరగనుంది.
నేడు ఢిల్లీలో కేంద్ర మంత్రి వర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరగనుంది. అయితే గత ఎన్నికలకంటే తక్కువ స్థానాలు రావడంతో ఈ మంత్రివర్గ సమావేశానికి ప్రాధాన్యత ఉంది. ఈసారి ఎన్డీఏ మిత్రుల సహకారంతో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు మిత్రులకు ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాల్సి ఉంటుంది.
ఈ మంత్రివర్గ సమావేశంలో
ఈ మంత్రివర్గ సమావేశంలో పెద్దగా ఏ అంశాలపై చర్చించకున్నప్పటికీ తిరిగి ప్రధానిగా మోదీ ప్రమాణస్వీకారంతో పాటు ఎన్నికల్లో సాధించిన విజయాలపై చర్చించనున్నారు. అంతేకాకుండా కొన్ని కీలక అంశాలపై మోదీ మంత్రి వర్గ సహచరులతో చర్చిస్తారని తెలిసింది. మంత్రి వర్గ కూర్పుతో పాటు మిత్రులకు అవకాశాలు కల్పించడంపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.
Next Story