Sun Dec 22 2024 07:54:35 GMT+0000 (Coordinated Universal Time)
నేడు కేంద్ర కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాల దిశగా?
నేడు కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది
నేడు కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. మహారాష్ట్ర ఎన్నికలు జరుగుతుండటంతో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ప్రధానంగా రైతులకు సంబంధించి కీలకమైన నిర్ణయాలు వెలువడే అవకాశముంది.
ముఖ్యమైన నిర్ణయాలు...
పంటలకు మద్దతు ధరలతో పాటుగా మరికొన్ని రాయితీలు కూడా ప్రకటించే అవకాశముందని తెలిసింది. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో కూడా గుడ్ న్యూస్ చెప్పే అవకాశముంది. కేంద్ర కేబినెట్ నిర్ణయాల కోసం అన్ని వర్గాల ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందన్నది ఉత్కంఠగా మారనుంది.
Next Story